CM Jagan: గత అనుభవాలను గుర్తు చేస్తూ.. ఈ నేతలకు సీఎం జగన్ స్పష్టమైన సంకేతం
వైసీపీలో కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారా? పార్టీని వీడే వారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నారా? పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారా? కోవర్టుల ముసుగులో ఉన్న వాళ్ళని బయటకు వెళ్ల వచ్చని డైరెక్ట్‌గా నేతలకే జగన్ చెప్పేస్తున్నారా? పార్టీని వీడుతున్న వారి విషయంలో సీఎం జగన్ వైఖరి ఎంటి.? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడినా అధినేత జగన్ సైలంట్‌గా ఎందుకు ఉంటున్నారు?
వైసీపీలో కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారా? పార్టీని వీడే వారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నారా? పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారా? కోవర్టుల ముసుగులో ఉన్న వాళ్ళని బయటకు వెళ్ల వచ్చని డైరెక్ట్‌గా నేతలకే జగన్ చెప్పేస్తున్నారా? పార్టీని వీడుతున్న వారి విషయంలో సీఎం జగన్ వైఖరి ఎంటి.? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడినా అధినేత జగన్ సైలంట్‌గా ఎందుకు ఉంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి.. ప్రతి పక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జాంపింగ్లు సర్వ సాధారణం. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారడం సహజంగా జరిగే పరిణామమే, కానీ ఏపీలో మాత్రం ఇవేమీ సాధారణంగా జరిగే అంశంగా కనిపించడం లేదు.
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు నుంచే ఏపీలో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మొదలు పెట్టారు. అధికారంలో ఉన్న సొంతపార్టీ వైసీపీని కాదని తెర వెనుక ప్రతిపక్ష టీడీపీతో జత కట్టారు కొందరు ఎమ్మేల్యేలు. అయితే ఇదంతా తెర వెనుక జరుగుతున్న వ్యవహారం అయినా.. అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీతో జత కడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ పంచాన చేరారు. అయితే ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా అనూహ్యంగా నాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అనం రామ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు సొంత పార్టీ వైసీపీని కాదని టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. దీనితో బలం లేని టీడీపీ అభ్యర్థిని బరిలోకి నిలిపి విజయం సాధిస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఒకవైపు నలుగురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరించడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన వైసీపీ.. సొంత పార్టీలో ఉంటూ తెర వెనుక పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా అడుగులు వేస్తూన్న వారిని గుర్తించింది. నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇంకా ఎవరెవరు టీడీపీతో చర్చలు జరుపుతున్నారన్న అంశంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే వైసీపీలో ఉంటూనే సొంత పార్టీకి సున్నం పెడుతున్న వారి వివరాలు సేకరించి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీకి దూరంగా ఉంటూ.. టీడీపీ, జన సేన పార్టీతో చర్చలు జరిపి సమయం కోసం ఎదురు చూస్తూన్న వారు ఎవ్వరూ, పార్టీని ఎందుకు వీడుతున్నారు అనే వివరాలను రాబడుతున్నారు.